1 నుంచి డిజిటైజేషన్ అమలు కావాలి: ఎన్‌బీఏ
న్యూఢిల్లీ, జూన్ 6: వచ్చే నెల ఒకటి నుంచి టీవీ ప్రసారాల డిజిటైజేషన్ అమలయ్యేలా చూడాలని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ) కేంద్రాన్ని కోరింది. బుధవారం సమావేశమైన ఎన్‌బీఏ కార్యవర్గం.. డిజిటైజేషన్ అమలుపై కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించింది. డిజిటైజేషన్ అమలు తేదీని పొడిగిస్తారన్న ఊహాగానాలపై స్పందిస్తూ.. నిర్దేశిత నిర్ణయానికి ప్రభు త్వం కట్టుబడి ఉంటుందని ఎన్‌బీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రసారభారం, ప్లేస్‌మెంట్ ఫీజుపై నిషేధం కేబుల్ పరిశ్రమ ను దెబ్బ తీస్తున్నాయని పేర్కొంది.
No comments:
Post a Comment