కొల్లెస్టరాల్ నియంత్రణలో గుండె ఆరోగ్యం!

Heart Line on the Palm Analysis a...


కొల్లెస్టరాల్ గురించిన సమాచారం అనేక వెబ్ సైట్లు మీకు వెల్లడిస్తూనే వున్నాయి. కొన్ని ఖచ్చితమైనవే కాని కొన్ని సరైనవి కావు. గుండె జబ్బులకు కొల్లెస్టరాల్ కు సంబంధం లేదు అనే సమాచారం సరికాదు. సరిఅయిన, రుజు సహిత సమాచారం మీ కొల్లెస్టరాల్ ను విజయవంతంగా ఎలా వ్యవహరించాలనేదానికి సహకరిస్తుంది.
అసలు కొల్లెస్టరాల్ అంటే? అది మైనంవలే, పసుపు రంగులో వుండే పదార్ధం. కొల్లెస్టరాల్ ను 18వ శతాబ్దంలో ఒక ఫ్రెంచి కెమిస్టు కనిపెట్టారు. ఆ సైంటిస్టు చేసిన పరిశోధన తర్వాతి కాలంలో కొల్లెస్టరాల్ ను జబ్బులకు ఎలా ముడిపెట్టవచ్చో తెలిపింది. కాని తర్వాతి పరిశోధనలు అది సరికాదని కూడా తెలిపాయి. శరీరంలోని ప్రతి కణం కొల్లెస్టరాల్ కలిగి వుంటుంది. అది లేకుండా మీరు జీవించలేరు. కొల్లెస్టరాల్ కణ చర్మపు పొరలో ప్రధాన భాగం. కణానికి శరీరానికి అనుసంధానంగా వుంటుంది. ఆ పొరలో కొల్లెస్టరాల్ అణువులుంటాయి. అవి కణంలోకి ప్రవేశించే పదార్ధాలను నియంత్రిస్తాయి.
ఈస్టరోజన్, టెస్టోస్టిరోన్ వంటి కొన్ని ప్రధాన హార్మోన్ల తయారీకి కొల్లెస్టరాల్ అవసరం చాలా వుంటుంది. సూర్య రశ్మినుండి విటమిన్ డి తయారు చేయాలంటే మీ శరీరానికి కొల్లెస్టరాల్ అవసరం వుంటుంది. కొల్లెస్టరాల్ లో రెండు రకాలుంటాయి. అవి ఎల్ డిఎల్ మరియు హెచ్ డిఎల్ గా పిలువబడతాయి. హెచ్ డిఎల్ కొల్లెస్టరాల్ శరీరానికి మేలు చేస్తుంది. అది ఎంత ఎక్కువగా వుంటే గుండె ఆరోగ్యానికి అంత మంచిది. ఏది ఏమైనప్పటికి అసలు కొల్లెస్టరాల్ అనేది ఎంత తక్కువగా వుంటే ఆరోగ్యానికి అంత మంచిది.
No comments:
Post a Comment